Heroine Priya Banerjee : పెళ్లి చేసుకున్న హీరోయిన్ ప్రియా బెనర్జీ

Heroine Priya Banerjee : పెళ్లి చేసుకున్న హీరోయిన్ ప్రియా బెనర్జీ
X

బాలీవుడ్ హీరో ప్రతీక్ బబ్బర్, హీరోయిన్ ప్రియా బెనర్జీ పెళ్లి చేసుకున్నారు. వాలంటైన్స్ డే సందర్భంగా వీరు ఒక్కటయ్యారు. ప్రతీక్‌కు ఇది రెండో వివాహం కాగా ప్రియాకు మొదటిది. వీరిద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటూ ఇప్పుడు పెళ్లి పీటలెక్కారు. కాగా ప్రియా బెనర్జీ ‘జోరు’, ‘అసుర’, ‘కిస్’ తదితర సినిమాలతోపాటు ‘రానానాయుడు’ వెబ్‌ సిరీస్‌లోనూ నటించారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు.

పెళ్లిలోనే రెచ్చిపోయిన ఈ జంట మండపంలోనే లిప్ లాక్ ఇచ్చుకున్నారు. దీంతో అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. అందరిముందే అలా చేసిందేంటి అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇక వివాహానికి సంబంధించిన ఫొటోలను ప్రియా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ‘‘నా జీవిత కాలం మొత్తం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను’’ అనే క్యాప్షన్ జత చేసింది.

ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇక ప్రియా భర్త ప్రతీక్ విషయానికొస్తే.. ప్రతీక్ రాజ్ బబ్బర్, దివంగత నటి స్మితాపాటిల్ దంపతుల కొడుకు. అయితే స్మితా ప్రసవ సమస్యల కారణంగా మరణించినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రతీక్, ప్రియా పెళ్లికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతుండగా.. అవి చూసిన వారు కొందరు ఆశ్చర్యపోతున్నారు.

Tags

Next Story