Srikalahasti Gatha Lyric Promo : జనులారా వినరారా శ్రీకాళహస్తి గాథ

Srikalahasti Gatha Lyric Promo : జనులారా వినరారా శ్రీకాళహస్తి గాథ
X

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు 'కన్నప్ప'. ఈ సినిమాతో ఆయన కుమార్తెలు అరియానా, వివియానా తెరంగేట్రం చేస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరిపై చిత్రీకరించిన 'శ్రీకాళహస్తి' లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది మూవీ టీం. 'జనులారా వినరారా శ్రీకాళహస్తి గాథ.. కనులారా మనసారా కనిన జన్మ ధన్యమే కదా' అంటూ సాగే పాట ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ సాంగ్ ను వారే పాడడం విశేషం. సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. స్టీఫెన్ దేవస్సీ స్వరాలు సమకూర్చారు. ముఖేష్ కుమార్ సింగ్ తెరకెకిస్తున్న ఈ మూవీలో మోహన్బాబు, ప్రభాస్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, అక్షయ్ కుమార్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Next Story