Hit 3 : హిట్ 3 రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు నేచురల్ స్టార్ నాని. ప్రతి సినిమా తర్వాత తన మార్కెట్ ను మరింత పెంచుకుంటూ పోతున్నాడు. చివరగా 'హయ్ నాన్న', ‘సరిపోదా శనివారం' సినిమాలతో హిట్లు సాధించిన నాని.. ప్రజెంట్ వరుస సినిమాలు లైన్లో పెట్టాడు. వీటిలో 'హిట్ 3' ఒక్కటి. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ 'హిట్' నుంచి వస్తున్న 3వ చిత్రం ఇది. శైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వాల్పోస్టర్ సినిమా, నాని హోం బ్యానర్ యునాని మస్ ప్రొడక్షన్స్ పై ప్రశాంత్ త్రిపురనేని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి మిక్కీ జె మేయర్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. యంగ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి నటిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రతి అప్ డేట్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా టీజర్ ఒక షాక్ ను ఇచ్చింది. ఇందులో నానిని చాలా వైల్డ్ గా కనిపించాడు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నా రు. ఈ విషయాన్ని పవర్ ఫుల్ పోస్టర్ అధికారికంగా అనౌన్స్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com