Dil Raju : సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మాలని దిల్‌ రాజు చెప్పడమేంటి?

Dil Raju : సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మాలని దిల్‌ రాజు చెప్పడమేంటి?
Dil Raju : సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మాలని వెంకటరమణారెడ్డి అలియాస్‌ దిల్‌ రాజు చెప్పడమేంటి? ప్రభుత్వానికి ఉచిత సలహా ఎందుకు ఇచ్చారు?

Dil Raju : సినిమా టికెట్లను ఆన్‌లైన్‌లో అమ్మాలని వెంకటరమణారెడ్డి అలియాస్‌ దిల్‌ రాజు చెప్పడమేంటి? ప్రభుత్వానికి ఉచిత సలహా ఎందుకు ఇచ్చారు? ఆమాటకొస్తే అసలు సినిమా టికెట్ల ఆన్ లైన్ అమ్మకం కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకు? తెలంగాణాలో థియేటర్లను కంట్రోల్ చేస్తున్న దిల్ రాజు.. ఆంధ్రాలో ఆన్ లైన్ లో టిక్కెట్లు అమ్మాలనడంలో అర్ధమేంటి..? ఆంధ్రలోని ధియేటర్ యజమానులను సంప్రదించకుండా దిల్ రాజు నిర్ణయం తీసుకోవడమేంటి..? ఆంధ్రాలో ఆన్ లైన్ టికెట్ అమ్మకాల వెనకున్న లోగుట్టు ఏంటి?

సినిమా టికెట్ల విషయంలో దిల్‌ రాజు పెత్తనం ఏంటి? థియేటర్ల యజమానులంతా వద్దు బాబోయ్‌ అంటుంటే.. దిల్‌ రాజు మాత్రం ప్రభుత్వం దగ్గరికే వెళ్లి యస్‌ బాస్‌ అనడం ఏంటి? సినిమా టికెట్లు ఎలా అమ్మాలనేది దిల్‌రాజే నిర్ణయిస్తాడా? ఓవైపు సినీ పెద్దలు ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వద్దనే సంకేతాలు ఇస్తుంటే.. పనిమాలా మంత్రి దగ్గరికెళ్లి మాట్లాడడంలో అర్థమేంటి? అంటే, సినీ పెద్దలను, థియేటర్ యజమానులను పరిగణలోకి తీసుకోరా? వాళ్ల అభిప్రాయాలు తీసుకోవాల్సిన అవసరం ఈ వెంకటరమణారెడ్డికి లేదనా?

ఆంధ్రాలో టికెట్ల అమ్మకంలో పారదర్శకత లోపించిందని ప్రభుత్వం పదే పదే గగ్గోలు పెడుతోంది. అసలు ప్రభుత్వం చేస్తున్న ఈ ఆరోపణల్లో నిజమెంత? టికెట్ల అమ్మకాల్లో థియేటర్ యజమాని గోల్ మాల్ చేసిన ఘటన ఒక్కటైనా ఉందా..? పోనీ, ఎవరైనా సినిమా టికెట్ల విషయంలో అన్యాయం జరిగిందని కంప్లైంట్‌ ఇచ్చారా? టికెట్‌ ధరలు ఇష్టారీతిన పెంచుతున్నారని ప్రజలు ధర్నాలు, ఆందోళనలు గట్రా చేశారా? ఇంతకీ, టికెట్ల అమ్మకాల్లో పారదర్శకత లోపించింది ఎక్కడ..? సినిమా పరిశ్రమపై గుత్తాధిపత్యం కోసమే ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలను తెరపైకి తెచ్చింది వాస్తవమేనా..? ఈ తంతు ఇలాగే సాగితే, స్పందించాల్సిన సినీ పెద్దలు అలా చూస్తూ ఉండి పోతే.. రేప్పొద్దున ఏ నిర్మాత ఎవరితో సినిమా తీయాలనేది కూడా పాలకులు డిసైడ్ చేసే రోజులు రావా?

పవన్ కల్యాణ్ ఆవేశంలో అర్ధం ఉంది. మరి దిల్ రాజు ఆలోచనలో ఏముంది..? సినిమా టికెట్లను బ్లాక్‌లో అమ్మి మరీ థియేటర్‌ యజమానులు నిర్మాతలకు దోచిపెడుతోంది వాస్తవం కాదా..? సినిమా కలెక్షన్స్‌లో నెంబర్‌ వన్, నెంబర్‌ టూ బుక్స్ ప్రిపరేషన్ ఎక్కడ జరుగుతోంది? నిజానికి నెంబర్‌-2 కలెక్షన్ బుక్ తయారీ.. నిర్మాతల కనుసన్నల్లో జరుగుతోందన్నది వాస్తవం కాదా? టికెట్ల అమ్మకాల జీఎస్‌టీ ఎగ్గొడుతున్నది వాస్తవమే అనుకుందాం.. మరి థియేటర్ యజమానులు ఎగ్గొడుతున్న జీఎస్టీ నేరుగా నిర్మాతలకు చేరుతోందన్నది వాస్తవం కాదా..? వాస్తవ కలెక్షన్లకు విరుద్ధంగా డీసీఆర్‌ కలెక్షన్‌లో అంకెలు... నిర్మాతల కనుసన్నల్లో జరుగుతుంది వాస్తవం కాదా..? నిర్మాతల్లో లోపించిన పారదర్శకత.. థియేటర్లపై మోపడంలో అర్ధమేమిటి..?

Tags

Read MoreRead Less
Next Story