Rashmika Mandanna : నేను సల్మాన్ వీరాభిమానిని : రష్మిక మందన్నా

Rashmika Mandanna : నేను సల్మాన్ వీరాభిమానిని : రష్మిక మందన్నా
X

తాను బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వీరాభిమానిని అని చెబుతోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా సినిమాల్లో బిజీ బిజీ గా గడుపుతోంది శ్రీవల్లి. యానిమల్, పుష్ప-2, ఛావా సినిమాలతో నార్త్ అభిమానుల హృదయాలను కొల్ల గొట్టి నేషనల్ క్రష్ అయిపోయిందీ అమ్మడు. త్వరలో సల్మాన్ తో కలిసి నటించిన 'సికిందర్' చిత్రంతో రానుంది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మార్చి 28న రంజాన్ పండుగ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీలో సల్మాన్ ఖాన్, రష్మిక జోడీని తెరపై చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పాటల్లో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. 'జోరా జబిన్', ‘బమ్ బమ్ భోలే' పాటలు ఇప్పటికే విడుదలై హిట్ అవ్వగా, ఇప్పుడు 'సికిందర్ నాచే’ అనే టైటిల్ ట్రాక్ పాట టీజర్ను విడుదల చేశారు. ఇందులో ఇద్దరి డాన్స్ సూపర్బ్ గా వచ్చింది. విడుదల సమయం దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ కూడా మొదలు పెట్టింది మూవీ టీం. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూ లో రష్మిక మట్లాడుతూ..తాను సల్మాన్ ఖాన్ కు వీర అభిమానిని అని చెప్పింది. ఆయనతో నటించాలనేది తన కల. ఆ కల ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదని తెలిపింది. లొకేషన్లో ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానంటోంది రష్మిక.

Tags

Next Story