Fatema Sana Sheikh : నేనూ కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే! : పాతిమా సనా షేక్

నువ్వునేను ఒకటవుదాం సినిమాలో నటించిన బ్యూటీ పాతిమా సనా షేక్. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హైదరాబాద్ కు చెందిన ఓ నిర్మాత తనను ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చింది. తాను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నానని అన్నారు. 'సౌత్ లో అవకాశం వచ్చింది. అది నా కెరీర్ను మలుపు తిప్పుతుందని భావించా. హైదరాబాద్లో ఆ చిత్ర నిర్మాత మీకు అవకాశం కావాలంటే ప్రతి పనిని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏది చేయడానికైనా అంగీకరించాలి' అన్నది. సినిమాకు ఏం అవసరమైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాను. ఆ నిర్మాత క్యాస్టింగ్ కౌచ్ అని చాలా ఓపెన్ గా మాట్లాడారు. దీంతో ఇబ్బందిపడి మౌనంగా వచ్చేశాను' అన్నది. ఇండస్ట్రీలో కొత్త వారికి అవకాశం రావడం చాలా కష్టమని ఫాతిమా సనా షేక్ చెప్పింది. ఎంతో కష్టపడి అవకాశం అందుకున్నా రిఫరెన్స్ పేరుతో నిర్మాతలే 15% రెమ్యూనరేషన్ తీసేసుకుంటారని అంటోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com