Genelia : సౌత్ ఇండస్ట్రీకి రుణపడి ఉంటా : జెనీలియా

సితారే జమీన్ పర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది జెనీలియా. ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా మూవీ ఇది. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ లో ఆమె ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. రోజుకు 10 గంటలు పని చేయడం కష్టమే కానీ, అసాధ్యం మాత్రం కాదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. అలాంటి సందర్భాల్లో తగిన విధంగా సర్దుబాటు చేసుకో వాలంది. కొన్ని సార్లు ఒకట్రెండు రోజులు సమయానికి మించి పనిచేయాల్సి వస్తే.. అక్కడ మన అవసరం ఉందని అర్థం చేసుకోవాలని పేర్కొంది. ఇక దక్షిణాది సి నిమాల్లో హీరోయిన్లకు బలమైన పాత్రలు లభించవన్న వాదనను ఖండించింది. తన కెరీరే అందుకు ఉదాహర ణగా చెప్పింది. తనకు దక్షిణాదిలో మంచి రోల్స్ లభిం చాయని చెప్పింది. తాను నటనలో ఎక్కువ విషయాలు నేర్చుకుంది కూడా సౌత్లోనే అని వెల్లడించిన నటి.. దక్షిణాది పరిశ్రమకు రుణపడి ఉంటానని చెప్పింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com