Shobitha : చైతూ భర్తగా రావడం నా అదృష్టం: శోభిత

నాగ చైతన్య సింప్లిసిటీ, మంచి మనసు తనను ఆకట్టుకున్నాయని భార్య శోభితా ధూళిపాళ వెల్లడించారు. అలాంటి వ్యక్తి భర్తగా రావడం తన అదృష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అతను హుందాగా, ప్రశాంతంగా ఉంటాడని, మర్యాదగా ప్రవర్తిస్తాడని పేర్కొన్నారు. ఎలాంటి ప్రేమ కోసమైతే ఎదురుచూశానో అది చైతూ నుంచి దక్కిందన్నారు. తనను జాగ్రత్తగా చూసుకుంటాడని తెలిపారు. ఈ ప్రేమ జంట ఈ నెల 4న పెళ్లితో ఒక్కటైన విషయం తెలిసిందే.
నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తొలినాళ్లలో తనకు ఎన్నో తిరస్కరణలు ఎదురయ్యాయని శోభిత అన్నారు. "అందంగా లేనని, ఆకర్షణీయంగా కనిపించనని నా ముఖం మీదే చెప్పేవారు. ఓ ప్రముఖ కంపెనీ వాణిజ్య ప్రకటనల కోసం ఆడిషన్స్‌కు వెళితే బ్యాక్ గ్రౌండ్ మోడల్‌గా కూడా పనికిరానని చెప్పడం నన్ను ఎంతో బాధించింది. అయితే, పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించి కొన్నాళ్ల తర్వాత అదే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాను. నాకు ఏదైన కథ పాత్ర నచ్చితేనే అంగీకరిస్తాను. ఎప్పుడూ తెరపై కనిపించాలనే కోరిక నాకు లేదు. అభిరుచికి తగ్గ పాత్రలే చేస్తాను’’ అని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com