Sonakshi Sinha : బరువు పెరిగానంతే .. నేను ప్రెగ్నెంట్ కాదు: సోనాక్షి సిన్హా

Sonakshi Sinha : బరువు పెరిగానంతే .. నేను ప్రెగ్నెంట్ కాదు: సోనాక్షి సిన్హా
X

తాను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై హీరోయిన్ సోనాక్షి సిన్హా స్పందించారు. తాను ఇంకా గర్భం దాల్చలేదని తెలిపారు. బరువు పెరిగానని, అందుకే లావుగా కనిపిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి రూమర్స్ ఇంకా ఎన్నిసార్లు ప్రచారం చేస్తారని ఆమె మండిపడ్డారు. తమకు పెళ్లై నాలుగు నెలలే అయిందని, ఇంకా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పారు. నేను గర్భిణిని కాదని మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా. బరువు పెరిగానంతే. నా భర్తతో బయటకు వెళ్లినప్పుడు నేను ప్రెగ్నెంట్‌ అనుకొని కొందరు అతడిని అభినందించారు. ఆ మరుసటిరోజు నుంచే నేను డైటింగ్‌ ప్రారంభించా (నవ్వుతూ). అలా ఎందుకు చేస్తారు. మనం వివాహ బంధాన్ని ఆనందించలేమా? మా పెళ్లి జరిగి ఐదు నెలలే అయింది. ఇంకా బంధువులు మమ్మల్ని వారి ఇంటికి ఆతిథ్యానికి పిలుస్తూనే ఉన్నారు. ఆ ప్రయాణాలతో మేం బిజీగా ఉన్నాం. ఇలాంటి రూమర్స్‌ ఎలా సృష్టిస్తారు. మేం కుక్కను ఎత్తుకొని ఉన్న ఫొటో పోస్ట్‌ చేస్తే దాని కింద ‘మీరు ప్రెగ్నెంటా’ అని కామెంట్స్‌ పెడుతున్నారు . ఆ ఫొటోకు, కామెంట్‌కు ఏమైనా సంబంధం ఉందా’ అని అన్నారు. కాగా గత జూన్‌లో తన ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను సోనాక్షీ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Tags

Next Story