Manisha Koirala : నేను సింగిల్నే.. కానీ ఒంటరిగా లేను: మనీషా కొయిరాలా

బాలీవుడ్లో కొన్నేళ్లపాటు నెం1 అందాల నటిగా యువ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది మనీషా కొయిరాలా. భాషతో సంబంధం లేకుండా దాదాపు అందరు స్టార్ హీరోలతో జత కట్టి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. నాగార్జున సరసన క్రిమినల్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది ఈ నేపాలీ సుందరి. అద్భుతమైన విజయాలను చవిచూసినా, విధి ఆమె పట్ల చిన్న చూపు చూడడంతో క్యాన్సర్ బారిన పడింది. దాంతో ఆమె జీవితం పూర్తిగా తల్లకిందులైంది. ప్రస్తుతం క్యాన్సర్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే తన వయసుకు తగిన పాత్రలతో తిరిగి బాలీవుడ్లో రాణించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే అందాల నటిగా గ్లామర్ను గుబాళింపజేసిన మనీషా.. గతంతో అనేక అఫైర్స్ వార్తలకు కూడా కేరాఫ గా నిలిచింది. నేపాల్ కు చెందిన సామ్రాట్ దహాయ్ని 2010లో పెళ్లి చేసుకుని కుటుంబ జీవితం ప్రారంభించినప్పటికీ ఆ బంధం కూడా రెండేళ్లోనే బెడిసి కొట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మనీషా.. పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకుంది. 'నా లైఫ్ లో రిలేషన్ షిప్స్ కారణంగా ఎక్కువ సమయం, శక్తి వృథా అయ్యింది. వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడింది. ప్రస్తుతం నేను సింగిల్నే కానీ ఒంటరిగా లేను. ఇలానే నాకు ప్రశాంతంగా ఉంది. నాక లాంగ్ ట్రెక్కింగ్లు చేయడం ఇష్టం. ఒంటరితన పు భావన కొన్ని సమయాల్లో కలిగిన, ఆ ఆలోచ నల నుంచి బయటకు వచ్చి, స్వతంత్రంగా జీవించడం గొప్ప అనుభవం' అంటూ చెప్పుకొచ్చింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com