Surabhi Lakshmi : లిప్ లాక్’ కోసం బ్రష్ చేసుకోమన్నా: సురభి లక్ష్మి

మలయాళ సినిమా ‘రైఫిల్ క్లబ్’ షూటింగ్ సమయంలో తన అనుభవాలను నటి సురభి లక్ష్మి పంచుకున్నారు. ఈ సినిమాలో కీలకమైన ముద్దు సన్నివేశంలో నటించే ముందు సహా నటుడు సజీవ్ కుమార్‌ను బ్రష్ చేసుకొని రమ్మన్నానని తెలిపారు. ఆయనకు సిగరెట్ తాగే అలవాటు ఉండటమే దానికి కారణమన్నారు. తానూ యాలకులు తిన్నట్లు పేర్కొన్నారు. ఈ సన్నివేశాన్ని సాధారణ సీన్ లాగే చిత్రీకరించాలని కోరినట్లు చెప్పారు. రొమాంటిక్ సీన్స్ నటనలో భాగమేనన్నారు. సినిమాల్లో ఒకప్పుడు అటువంటి సన్నివేశాలు బాగా తక్కువగా ఉండేలా చేసేవారు.. లేదా భారీగా సెన్సార్ కత్తెరకు గురయ్యాయి. అయితే సమకాలీన ఫిల్మ్ మేకర్‌లు ఇప్పుడు వాటిని పరిపక్వత తో చిత్రీకరిస్తూ అసభ్యత అనిపించకుండా మెప్పిస్తున్నారు. .ఈ పరిస్థితుల్లో, నటీనటులు కూడా ఆయా సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు తమ అనుభవాలు వ్యక్తపరచడం గురించి ఒకప్పుడు సంకోచించేవారు, ఇప్పుడు మాత్రం బహిరంగంగా ప్రస్తావిస్తున్నారు. కామెడీ, యాక్షన్ సన్నివేశాల సమయంలో తమ అనుభవాలను పంచుకున్నట్టే రొమాంటిక్ సీన్స్ గురించి కూడా మాట్లాడడంతో తప్పులేదు ఎందుకంటే అదంతా నటనేలో భాగమే కాబట్టి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com