I Bomma Ravi :పైరసీ నెట్ వర్క్ బయట పెట్టని ఐ బొమ్మ రవి..!

మొత్తానికి ఐ బొమ్మ రవి ఐదు రోజుల పోలీసు కస్టడీ ముగిసింది. నిన్న వైద్య పరీక్షల తర్వాత ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించారు పోలీసులు. అయితే పోలీసు కస్టడీలో పైరసీ నెట్వర్క్ గురించి మాత్రం రవి బయట పెట్టలేదని తెలుస్తోంది. ఒక్కో రోజు ఒక్కో కేటగిరి గురించి పోలీసు అధికారులు ప్రశ్నలు కురిపించారు. రవి పర్సనల్ విషయాలు, ఫ్యామిలీ విషయాల గురించి తొలి రోజు ప్రశ్నలు అడిగారు. పైరసీ ఎలా చేశావు ఎలా ఇందులోకి వచ్చావు అనే విషయాలను పోలీసులు రాబట్టారు. వాటిపై రవికూడా స్పష్టమైన సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండో రోజు బ్యాంకు లావాదేవీలు, రవి ఆస్తుల గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది.
మూడో రోజు స్వయంగా సిపి సజ్జనార్ ఐ బొమ్మ రవిని విచారణ చేశారు. అందులో పరిస్థితి ద్వారా వచ్చిన డబ్బులను ఏం చేశాడు, బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులు ఎవరికీ ట్రాన్స్ఫర్ చేశారు అనే విషయాలపై సజ్జనర్ ఆరా తీశారు. ఇక నాలుగో రోజు పైరసీ ద్వారా వచ్చిన డబ్బులను ఏం చేశాడు అనేది రవి బయట పెట్టాడు. ఇలా వచ్చిన డబ్బులు ఎప్పటికప్పుడు ఖర్చు పెడుతూ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసినట్టు తెలిపాడు. స్టార్ హోటల్స్ లో బసచేస్తూ, 15 రోజులకు ఒక దేశం తిరుగుతూ.. బిజినెస్ క్లాస్ ఫ్లైట్స్ లో మాత్రమే జర్నీ చేస్తూ గడిపినట్లు తెలిపాడు రవి. ఇక ఐదో రోజు వైరస్ నెట్వర్క్, వెబ్ సైట్స్ గురించి కీలక విషయాలను రాబట్టాలని పోలీసులు చాలానే ప్రయత్నాలు చేశారు.
కానీ ఐ బొమ్మ రవి మాత్రం తన పైరసీ నెట్ వర్క్ గురించి మాత్రం అస్సలు బయట పెట్టలేదని తెలుస్తోంది. ఎలాంటి డొమైన్లు వాడాడు, ఏ రకంగా పైరసీ చేశాడు అనే విషయాలను మాత్రం బయట పెట్టకుండా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. వీటి గురించి అడిగినప్పుడల్లా తనకు గుర్తులేదు మర్చిపోయాను చాలా రోజులు అయిపోయింది అనే సమాధానాలు రవి ఇచ్చినట్లు అంతర్గత సమాచారం. ఇక ఐ బొమ్మ రవి తన వెబ్ సైట్స్ గురించి ఇచ్చిన కీలక విషయాలను బట్టి పోలీసులు ఎథికల్ హ్యాకర్స్ సాయం తీసుకుని ఈ నెట్వర్క్ సీక్రెట్ ను చేదించాలని చూస్తున్నారు. రవి మానసిక ఆరోగ్య పరిస్థితిని బట్టి విచారణ చేసినట్లు తెలుస్తోంది. కుదిరితే మరోసారి అతన్ని కస్టడీలోకి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

