Kalyan Ram : ఆ నటిని అమ్మ అని పిలుస్తా: కళ్యాణ్ రామ్

Kalyan Ram : ఆ నటిని అమ్మ అని పిలుస్తా: కళ్యాణ్ రామ్
X

సీనియర్ నటి విజయశాంతిని అమ్మ అని పిలుస్తానని హీరో నందమూరి కళ్యాణ్ రామ్ చెప్పారు. ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’లో కలిసి నటించడం వల్ల ఆమెతో అనుబంధం పెరిగిందని చెప్పారు. ఈ సినిమాలో తల్లీకొడుకులు ఎందుకు దూరమయ్యారు? తిరిగి ఎలా కలిశారు? అనేదే కీలకమన్నారు. విజయశాంతి ఈ చిత్రానికి ప్రధాన బలమని, పోరాట సన్నివేశాల్లోనూ అద్భుతంగా నటించారని కొనియాడారు. రేపు ఉ.10 గంటలకు ఈ సినిమా టీజర్ విడుదల కానుంది.

విజయశాంతి మాట్లాడుతూ.. ‘‘చాలామంది కొత్త దర్శకులను కల్యాణ్‌ బాబు పరిచయం చేశారు. విజయం అందుకున్నారు. ఈ సినిమా విడుదల తర్వాత ప్రదీప్‌ (దర్శకుడు)కు మరిన్ని అవకాశాలొస్తాయి. కల్యాణ్‌ రాజీపడకుండా నటించారు’’ అని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉన్న విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’తో నటిగా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’లోనే నటించారు. టీజర్‌ సోమవారం ఉదయం విడుదల కానుంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags

Next Story