Kalyani Priyadarshan : నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను.

అఖిల్ అక్కినేని సరసన 'హలో' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్. ఆ తర్వాత సాయిధరమ్ తేజ్ తో 'చిత్రలహరి', శర్వానంద్ సరసన ‘రణరంగం' చిత్రాల్లో నటించినా పెద్దగా చాస్సలు. రాలేదు. అయితే తన మాతృభాష మలయాళంలో మాత్రమే వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా సూపర్ ఉమెన్ గా 'కొత్త లోక చాప్టర్ 1' తో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించగా డామినిక్అరుణ్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 29న రిలీజైన ఈ మూవీ తొలిరోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఇప్పటివరకూ రూ.200 కోట్లు వసూలు చేసింది. దీనిపై తాజాగా కల్యాణి ప్రియదర్శన్ ఆనందం వ్యక్తం చేసింది. 'మలయా ళంలో 'లోక చాప్టర్ 1: చంద్ర’ సక్సెస్ తర్వాత అందరూ నన్ను ఫీమేల్ సూపర్ హీరో అని పిలుస్తున్నరు. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. ఈ సినిమా విజయం సాధించడానికి నాతో పాటు మా టీమ్ ని వారంతా కష్టపడ్డారు. ఈ సక్సెస్ క్రెడిట్ వాళ్లకు కూడా వెళ్తుంది. నేను ఈ చిత్రానికి సైన్ చేసినప్పుడు ఇంత బాగా ఆడుతుందని అనుకోలే. మంచి స్టోరీలో భాగం కావాలని మాత్రమే ఆలోచించాను. షూటింగ్ చేసే టైంలోనే ఇది కచ్చితంగా విజయం సాధిస్తుందని అర్థమైంది. ఈ సినిమాతో ఎంతోమంది స్ఫూర్తి పొందుతున్నరు. హీరోయిన్స్ కూడా ఎలాంటి పాత్రల్లోనైనా చేయగలరు అని అందరికీ నమ్మకం కలిగింది' అంటూ చెప్పుకొచ్చింది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com