Rashmika : వాళ్ల సపోర్ట్ మర్చిపోలేను.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Rashmika : వాళ్ల సపోర్ట్ మర్చిపోలేను.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

యానిమల్, పుష్ప 2, ఛావా వంటి బ్లాక్బస్టర్ హిట్లతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన హీరోయిన్ రష్మిక మంధాన్న. ఆ తర్వాత విడుదలైన 'సికందర్' మాత్రం ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. అయినప్పటికీ తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో సినిమాలతో తిరుగులేకుండా దూసుకెళ్తాంది. ఈ అమ్మడు ఇప్పుడు వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. తన కెరీర్, ఒత్తిళ్లను ఎలా ఎదుర్కొంటుందో వివరించింది. 'జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే విషయం నాకు తెలుసు. నేను ఎప్పుడో చెప్పినట్లుగా మీకు ఒక రోజు అన్నీ ఉండవచ్చు. మరుసటి రోజు అంతా మారిపోవచ్చు. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా కుటుంబం, స్నేహితుల నుంచి సపోర్ట్ ఉండడం నా అదృష్టం. పూర్తి నిజాయితీగా చెప్పాలంటే, నా చిన్నతనంలో నేను నటి అవుతానని ఎప్పుడూ అనుకోలేదు. అదెప్పుడూ నా ప్లాన్స్ లో భాగం కాదు. కానీ ఇప్పుడు తిరిగి వెనక్కి చూస్తే నేను ఈ స్థాయికి చేరుకున్నందుకు ఎంతో గొప్పగా ఉంది. నటిగా నా జీవితాన్ని అర్థవంతమైన విధంగా మార్చింది. కెరీర్ విషయంలో నేను ఎప్పుడూ స్థిరంగా ఉంటాను. అందరికీ ఇచ్చే సలహా కూడా ఇదే. మనసుకు నచ్చిన పని చేయాలి. బయటకు వెళ్లండి! అనుకున్న దాన్ని సాధించండి. కూర్గ్ లాంటి చిన్న పట్టణంలో పుట్టిన నేను.. నేడు ఈ స్థాయిలో ఉన్నానంటే అదే కారణం. వచ్చిన ప్రతి చాన్స్ ని యూజ్ చేసుకుంటూ ముందుకుసాగాలి. ఈ జర్నీలో కఠినమైన పాఠాలు ఏవీ లేవు. కానీ కొన్ని విలువైన అనుభవాలే ఉంటాయి. ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండడానికి ప్రయ త్నించండి కానీ.. ప్రతి ఒక్కరినీ సంతోష పెట్టాల్సిన అవసరంతో మీపై భారం వేసుకోకండి. ఫస్టీ మీ సంతోషంపై ఫోకస్ చేయండి. విమర్శలకు కుంగి పోవద్దు. ఎందుకంటే మీ వాల్యూ మీకు మాత్రమే తెలుసు' అంటూ నేషనల్ క్రష్ చెప్పుకొచ్చింది.

Tags

Next Story