Priya Prakash : ఆ రోజులు మర్చిపోలేను.. అజిత్ అంటే పిచ్చి

Priya Prakash : ఆ రోజులు మర్చిపోలేను.. అజిత్ అంటే పిచ్చి
X

స్టార్ హీరో అజిత్ హీరోగా అధిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. త్రిష ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, అర్జున్ దాస్ విలన్ గా కనిపించాడు. ఇందులో యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్ నిత్య పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. మరీ ముఖ్యంగా 'తొట్టు తొట్టు' పాటతో విశేష స్పందన అందుకుంది. దీంతో తాజాగా ఈ మూవీ జర్నీ పై ప్రియా ప్రకాష్ సోషల్ మీడియా ద్వారా తన ఆనందం వ్యక్తం చేసింది. 'ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియడం లేదు. నా ఆనందాన్ని మీతో పంచుకోవాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నా. అజిత్ సార్.. అంటే నాకెంతో అభిమానం. చెప్పడానికి మాటలు సరిపోవడం లేదు. ఫస్ట్ డే నుంచి షూట్ చివరి రోజు వరకూ ఎంతో సపోర్ట్ చేశారు. నేను కూడా టీమ్లో భాగమేననే భావన కలిగించేలా ధైర్యం చెప్పారు. సెట్లో ఎవరూ ఇబ్బందిపడ కుండా ఉండేలా మీరు అందరితో కలివిడిగా ఉండేవారు. షిప్ లో షూట్ చేసిన రోజులను నేను ఎప్పటికీ మర్చిపోలేను. మనమంతా కలిసి భోజనం చేయడం.. సరదాగా జోకులు వే సుకోవడం.. ఎంతో నచ్చింది. మీలాంటి మంచి వ్యక్తిని ఎప్పుడూ కలవలేదు. కుటుంబం, కార్లు, రేస్, ట్రావెలింగ్ గురించి మాట్లాడేటప్పుడు మీ కళ్లలో కనిపించే ఆ మెరుపు అందరినీ ఆకర్షి స్తుంది. వృత్తిపై మీకున్న నిబద్ధత, సహనం, నాలాంటి ఎంతోమంది కొత్తతరం నటీనటుల కు స్ఫూర్తి. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే లక్షణాన్ని మీ నుంచి నేర్చుకున్న. 'తుట్టు తుట్టు’ పాటలో మీతో కలిసి వర్క్ చేయడం నాకెంతో ప్రత్యేకంగా అనిపించింది' అంటూ ప్రియా రాసుకొచ్చింది.

Tags

Next Story