Gutta Jwala : నితిన్ కోసమే ప్రత్యేక పాటలో డాన్స్ వేశాను: గుత్తా జ్వాల

హీరో నితిన్ కోసమే తాను ‘గుండెజారి గల్లంతయ్యిందే’లో ప్రత్యేక గీతం చేశానని మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఆ సినిమా కంటే ముందు నాకు చాలా సినిమా ఛాన్సులు వచ్చినా ఒప్పుకోలేదు. నితిన్ నాకు బెస్ట్ ఫ్రెండ్. తన సినిమాలో స్పెషల్ సాంగ్ చేయాలని అడిగాడు. నాకు ఆసక్తి లేకపోయినా తన ఒత్తిడి వల్లే ఆ సాంగ్ చేశాను. ఆ పాట తన సినిమాకు హెల్ప్ అయింది’ అని గుర్తుచేసుకున్నారు.
సినిమా ఇండస్ట్రీలో తనకు చాలామంది స్నేహితులు ఉన్నారని, వారిని చూస్తే సినిమా రంగంలో ఎలా ఉండాలో తెలుస్తుందని గుత్తా జ్వాలా వివరించారు. సినిమాల్లో రాణించాలంటే సిగ్గు పడకూడదని, అది తనవల్ల కాదని చెప్పారు. ఎప్పుడో చేసిన సాంగ్ షూటింగ్ గురించి ఇప్పుడు మాట్లాడినా ఏదోలా అనిపిస్తుందని అన్నారు. చాలా విషయాల్లో సర్దుకుపోవాల్సి వస్తుందని వివరించారు. తన మనస్తత్వానికి అది సరిపడదని తెలిపారు. బ్యాడ్మింటన్ లో పది గంటలు ప్రాక్టీస్ చేస్తే తర్వాత విశ్రాంతి తీసుకునే వీలుంటుందని, సినిమాల్లో అయితే 24 గంటలూ ఏదో ఒక పని ఉంటుందని గుత్తా జ్వాలా చెప్పుకొచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com