Trisha : పెళ్లిపై నాకు నమ్మకం లేదు: త్రిష

Trisha : పెళ్లిపై నాకు నమ్మకం లేదు: త్రిష
X

వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని హీరోయిన్ త్రిష అన్నారు. పెళ్లి అయినా, కాకపోయినా తనకు ఫరవాలేదని ఆమె తేల్చి చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ఎదురైన ప్రశ్నకు ఆమె ఇలా సమాధానమిచ్చారు. కాగా త్రిష ప్రస్తుతం కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న ‘థగ్ లైఫ్’ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’లోనూ ఆమె కనిపించనున్నారు. త్రిష పెళ్లి గురించి కొంతకాలంగా వదంతులు వ్యాప్తి చెందుతోన్న విషయం తెలిసిందే. ఆమె ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని ఇటీవల ప్రచారం జరిగింది. ఆ వదంతులను ఆమె ఖండించారు. ‘‘పెళ్లి ఎందుకు చేసుకోలేదు అంటే నా వద్ద సమాధానం లేదు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటానో మాత్రం నాకే తెలియదు. నా మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా చేసుకుంటాను. నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు జీవితాంతం నాకు తోడు ఉంటాడనే నమ్మకం కలగాలి. అప్పుడే చేసుకుంటాను. పెళ్లి చేసుకొని విడాకులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. పెళ్లి చేసుకొని చాలామంది అసంతృప్తితో జీవిస్తున్నారు. అలాంటి పరిస్థితి నాకు ఎదురుకాకూడదు’’ అని ఓ సందర్భంలో చెప్పారు.

Tags

Next Story