Regina Cassandra : నాకు మతంపై పట్టింపులు లేవు : రెజీనా

Regina Cassandra : నాకు మతంపై పట్టింపులు లేవు : రెజీనా
X

టాలీవుడ్ ఆడియన్స్ కు రెజీనా అంటే ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, పిల్ల నువ్వు లేని జీవితం, సౌఖ్యం, శ్రీనివాస కళ్యాణం వంటి మూవీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రిలీజైన ఆచార్య సినిమాలో ఐటెమ్ సాంగ్ లో కనిపించి మెప్పించింది. ప్రస్తుతం అజిత్ హీరోగా విడాముయార్చి మూవీలో కీలక రోల్ లో నటిస్తోంది. ఈ నేపథ్యంలోనే మతంపై రెజీనా కీలక వ్యాఖ్యలు చేసింది. తన ఆరేళ్ల వయసులో తల్లిదండ్రులు విడిపోయారని.. అందుకే తాను పుట్టినప్పుడు ఇస్లాం మతస్తురాలిగా ఉన్నానని చెప్పుకొచ్చింది. అందుకే తనపేరు రెజీనా అని పెట్టారని.. తర్వాత తాను క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యాయని తెలిపింది. అప్పుడు తన పేరుకు కసాండ్రా జత చేశారట. కానీ తనకు మతంపై ఎలాంటి పట్టింపులు లేవని.. చర్చి, మసీదు, గుడికి వెళ్తానని చెప్పింది.

Tags

Next Story