Meenakshi Chaudhary : సీనియర్ హీరోలతో నటిస్తా.. ఇబ్బంది ఏమీ లేదు : మీనాక్షి చౌదరి

ఇటీవలే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా మంచి ఫేమ్ సంపాదించిన మీనాక్షి చౌదరి.. మొదట ‘ఇచ్చట వాహనము లు నిలపరాదు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. హిట్ 2 చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకున్న మీనాక్షి.. రీసెంట్ గా లక్కీ 'భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతోనూ అలరించింది. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ అమ్మడు కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ప్రస్తుతం యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తో కలిసి 'అనగనగా ఒక రాజు' మూవీలో నటిస్తు న్న మీనాక్షి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆస క్తికర విషయాలు పం చుకుంది.‘నా చిన్నతనంలో ఇతరులతో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. ఎందుకంటే కాలేజ్ రోజుల్లోనే నా ఎత్తు 6.2 ఉండేది. దాని వల్లే నాతో చాలా మంది డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు. అప్పట్లో నా ఎత్తు నాకు సమస్యగా మారింది. అప్పుడప్పుడు చాలా బాధగా కూడా అనిపించేది. ఇక ఆర్మీ ఆఫీసర్ అయిన మా నాన్నకు ఆ విషయం గురించి చెప్తే నీ సమస్య నువ్వే పరీక్షించుకో అని అన్నారు. దీంతో పుస్తకాలనే స్నేహితులుగా మార్చుకున్న. బుక్స్ చదవడంతో పాటు అందాల పోటీల్లో పాల్గొన్నా కూడా ఆసక్తికలిగింది. ఇం డస్ట్రీలో వచ్చిన ప్రతి ఆఫర్ సద్వినియోగం చేసుకున్నాను. ఇండ స్త్రీలో ప్రతి చిన్న ఆఫర్ కూడా కచ్చితంగా ముందు కెరీర్ ని నిలదొక్కుకునేందుకు సహయపడుతుంది. సీనియర్ హీరోలతో నటించడానికి నాకు ఎలాంటి సమస్యలేదు. అది ఒక జోనర్ భావిస్తాను” అని మీనాక్షి చెప్పుకొచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com