Divya Bharathi : నేను ఎవరితోనూ డేట్ చేయలేదు: దివ్య భారతి

Divya Bharathi : నేను ఎవరితోనూ డేట్ చేయలేదు: దివ్య భారతి
X

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుటుంబ సమస్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని హీరోయిన్ దివ్య భారతి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తాను ఏ నటుడితో గానీ పెళ్లైన వ్యక్తులతో గానీ డేట్ చేయలేదని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలతో తన గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని పేర్కొన్నారు.

నాకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తుల కుటుంబపు విషయాల్లో నా పేరును లాగుతున్నారు. జీవీ ప్రకాశ్ కుటుంబ సమస్యలతో నాకు ఎటువంటి లింక్ లేదు. నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నేను ఎవరితోనూ డేటింగ్‌లో లేను. ముఖ్యంగా పెళ్లైన‌ వ్యక్తితో డేటింగ్ అసలే చేయను. ఆధారాలు లేకుండా రూమర్స్‌ను పుట్టించొద్దు. ఇప్పటివరకూ ఈ విషయంపై నేను నోరు మెదపలేదు. కానీ, కొన్ని రోజులుగా ఈ రూమర్స్ నా సహనాన్ని పరీక్షిస్తున్నాయి.

దివ్య భారతి, జీవీ కలిసి బ్యాచిలర్, కింగ్‌స్టన్ మూవీలో నటించారు. ఈ క్రమంలో వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. మరోవైపు జీవీ ప్రకాష్ మ్యూజిక్ డైరక్షన్ చేస్తూనే వీలు దొరికినప్పుడల్లా హీరోగా సినిమాలు చేస్తున్నారు. అయితే తమ సుదీర్ఘ వైవాహిక జీవితానికి స్వస్తి చెబుతూ సైంధవికి విడాకులు ఇచ్చారు జీవీ. వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్.. చాలా ఏళ్ల పాటు ప్రేమించి తర్వాత పెళ్లి చేసుకున్నారు.

Tags

Next Story