Ananya Pandey : దీపిక నుంచి చాలా నేర్చుకున్నా : అనన్యపాండే

వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటీమణుల్లో అనన్యపాండే ఒకరు. అలా ఎంట్రీ ఇచ్చిన అందరికీ లక్ కలసి రాదు. 2019 లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఇండ స్త్రీలోకి ఎంట్రీ ఇచ్చిన భామ అనన్యపాండే. చంకీ పాండే కూతురుగా బీ టౌన్ లోకి ఎంట్రీ ఇచ్చిందీ భామ. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవు తున్న భారీ హిట్ మాత్రం అందుకోలేదు. తెలుగులో 'లైగర్' మూవీ తో వచ్చిన అమ్మడు ఇక్కడ కూడా నిరాశే ఎదురుకుంది. వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ అమ్మడికి మొదట్లో కెరీర్ పరమైన ఇబ్బందులు తప్పలేదు. మన అవసరాలు, సమస్యల గురించి నిర్మొహమాటంగా, ధైర్యంగా చెప్పాలనేది దీపికా పదుకొణే నుంచే నేర్చకున్నా నంటోంది. ఈ విషయం తనకు 'గెహ్రియాన్' సినిమా సెట్ లోనే అర్థమైందని చెబుతోంది. ఆ సినిమాలో నా సహ నటి దీపికా పదుకొణె నటించింది. ఆమె సెట్లో ప్రతి ఒక్కరికీ అండగా నిలబడేదని తెలిపింది. ప్రతి ఒక్కరినీ ప్రేమగా పలకరించేద ని, అందరితోనూ మర్యాదపూర్వకంగా వ్యవ హరించేదని తెలిపింది. ఆమె స్టార్ హోదాలో ఉన్నా కొంచెం కూడా గర్వం కనిపించదం టోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న జీవిత సూత్రం ఆమె నుంచే నేర్చుకున్నానని చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com