Ileana : నాకు నటించడం చాలా ఇష్టం.. సరైన సమయంలో రీఎంట్రీ ఇస్తా - ఇలియానా

Ileana  : నాకు నటించడం చాలా ఇష్టం.. సరైన సమయంలో రీఎంట్రీ ఇస్తా - ఇలియానా
X

టాలీవుడ్‌లో ఒకప్పుడు అగ్రతారగా వెలిగిన గోవా బ్యూటీ ఇలియానా తన సినీ రిఎంట్రీపై అభిమానులకు స్పష్టతనిచ్చారు. పెళ్లి, పిల్లల కారణంగా వెండితెరకు కొంతకాలంగా దూరంగా ఉన్న ఆమె, నటనకు గుడ్‌బై చెప్పలేదని, సరైన సమయంలో తిరిగి వస్తానని ప్రకటించారు. తాజాగా నటి నేహా ధూపియాతో జరిగిన ఒక లైవ్ సెషన్‌లో తన వ్యక్తిగత, సినీ జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

నటనకు దూరంగా.. పిల్లలతో బిజీగా..

ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని ఇద్దరు కుమారుల ఆలనాపాలనకే కేటాయిస్తున్నానని ఇలియానా తెలిపారు. "సినిమాల్లోకి తిరిగి రావాలని బలంగా కోరుకుంటున్నాను. కెమెరా ముందు నటించడం, అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేయడం, సినిమా సెట్స్‌లో ఉండే వాతావరణాన్ని నేను చాలా మిస్ అవుతున్నాను. నా పని అంటే నాకు చాలా ఇష్టం. కానీ, ప్రస్తుతం నా పిల్లలే నా ప్రపంచం. వారిని చూసుకోవడమే నా మొదటి ప్రాధాన్యత. అందుకే నటనకు కాస్త విరామం ఇచ్చాను" అని ఆమె వివరించారు.

ఇద్దరు కుమారులతో ఇలియానా జీవితం

ఇలియానా తన భర్త మైఖేల్ డోలన్ తో కలిసి అమెరికాలోని టెక్సాస్, హూస్టన్‌లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు కోవా ఫీనిక్స్ డోలన్ 2023 ఆగస్టు 1న జన్మించగా, రెండవ కుమారుడు కియాను రఫే డోలన్ 2025 జూన్ 19న జన్మించాడు. తల్లిగా తన ప్రయాణంలో ఎదురైన సవాళ్లను గురించి ఆమె భావోద్వేగంతో పంచుకున్నారు. "తల్లిగా నేను సరిగ్గా బాధ్యతలు నిర్వర్తించడం లేదేమో అని చాలాసార్లు నాపై నాకే సందేహాలు కలిగాయి. కానీ ఇలాంటి ఆలోచనలు మాతృత్వంలో సహజమని నెమ్మదిగా అర్థం చేసుకున్నాను" అని ఆమె అన్నారు.

Tags

Next Story