Janhvi Kapoor : ఈ స్పెషల్ డెనిమ్ జాకెట్ అంటే చాలా ఇష్టం: జాన్వీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి నటవారసురాలిగా సినీ ఆరంగేట్రం చేసిన జాన్వీ కపూర్ తనను తాను నటిగా నిరూపించుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతోంది. అదే సమయంలో నిరంతర ఫ్యాషన్ సెన్స్ తో ప్రజల దృష్టిని తనవైపు తిప్పేసు కోవడంలోనూ సక్సెస్ సాధించింది. జాన్వీ కపూర్ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది. త్వరలో రామ్ చరణ్ కలిసి పెద్ది మూవీలో కనిపించనుంది. అయితే తాజాగా ఆమె తనదైన యూనిక్ స్టైల్ తో కనిపించింది. జగదేక వీరుడు అతిలోక సుందరి పోస్టర్ ప్రింట్ చేసి ఉన్న క్లాసిక్ డెనిమ్ జీన్స్ షర్ట్ ధరించి కనిపించిందీ భామ. డెనిమ్స్ షర్ట్ వెనక భాగంలో ఈ పోస్టర్ ముద్రించి ఉంది. చిరంజీవి శ్రీదేవితో పాటు నాటి విలన్ అమ్రీష్ పురి ఫోటో కూడా పోస్టర్లో ఉంది. ఈ స్పెషల్ డెనిమ్ జాకెట్ అంటే తనకు చాలా ఇష్టమ ని జాన్వీ తెలిపింది. శ్రీదేవిని ఒక దేవదూత అద్భుత యువరాణి అని పేర్కొంది. జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ని తెరకెక్కిస్తే నటించేందుకు సిద్దమేనని కూడా జాన్వీ ఇప్పటికే చెప్పింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com