Samantha : ప్రేమించే భాగస్వామి కావాలి.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్

Samantha : ప్రేమించే భాగస్వామి కావాలి.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

వచ్చే ఏడాదంతా బిజీ బిజీగా గడపాలని, తనకు ప్రేమించే భాగస్వామి కావాలని కోరుకుటోంది సమంత రుతు ప్రభు. 2025లో తన జ్యోతీషం ఎలా ఉండబోతోందనేదానిపై ఇన్స్టాగ్రాంలో స్టోరీ పోస్టు చేసింది సమంత. సిటాడెల్ హనీ బన్నీలో కనిపించిన సమంత ఇన్స్టాలో స్టోరీలతో యాక్టివ్ గా ఉంటోంది. తన రాశికి 2025 ఎలా ఉండబోతోందంటూ ఆమె ఇన్స్టా వేదికగా షేర్ చేశారు. అందులో చెప్పిన విధంగా జరగాలనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. దీనిని అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇటీవలే తన మాజీ భర్త నాగ చైతన్య, శోభితా

ధూళిపాళ్లను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె సోషల్ మీడియాలో చేసే ప్రతి పోస్టు వైరల్ గా మారుతోంది. ఇవాళ షేర్ చేసిన ఇన్ స్టా స్టోరీలో..‘వృషభ, కన్య, మకర రాశులవారు 2025లో వీటిని పొందే అవకాశం ఎక్కువగా ఉంది' అవేమిటంటే..' ఏడాది అంతా చాలా బిజీగా ఉంటారు. వృత్తి పరంగా మెరుగుపడతారు. డబ్బు ఎక్కువగా సంపాదిస్తారు. ఆర్థికంగా బలంగా ఉంటారు. నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని పొందుతారు. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. మరిన్ని అవకాశాలు సొంతం చేసుకుంటారు. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ ఉంటారు. పిల్లలను పొందుతారు' అని ఉంది. ఇందులో రాసి ఉన్న విధంగా మీకు అంతా మంచే జరగాలని అభిమానులు కామెంట్ పెడుతున్నారు.

Tags

Next Story