Kamal Haasan : తప్పు చేస్తేనే సారీ చెప్తా.. లేదంటే నో : కమల్ హాసన్

Kamal Haasan : తప్పు చేస్తేనే సారీ చెప్తా.. లేదంటే నో : కమల్ హాసన్
X

కన్నడ భాషపై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ వస్తున్న డిమాండ్లను సినీన టుడు కమల్ హాసన్ శుక్రవారం తోసిపుచ్చారు. "నేను తప్పుచేస్తే క్షమాపణ చెబుతాను. చెయ్యకుంటే క్షమాపణ చెప్పను. ఇదే నా జీవనశైలి. దయచేసి దాని జోలికి రాకండి. భారత్ ఒక ప్రజాస్వామ్య దేశం. చట్టం, న్యాయం పట్ల నాకు నమ్మకం ఉంది" అని అన్నారు.

కన్నడం తమిళం నుంచి పుట్టింది అంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు కన్నడనాట పెనుదుమారానికి దారి తీశాయి. కన్నడిగుల భావోద్వేగాలను తీవ్రంగా దెబ్బతీసిన నటుడి సినిమా థగ్ లైఫ్ ప్రదర్శనను రాష్ట్రంలో నిషేధించాలని కోరుతూ రాష్ట్ర మంత్రి శివరాజ్ తంగదగి కర్నాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ చాంబర్(కేఎఫ్సీసీ)కు ఒక లేఖ రాశారు. లేఖపై స్పందించిన కేఎఫ్సీసీ సినిమా ప్రదర్శనను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై కమల్ హా ఎన్ మాట్లాడుతూ ఇలాంటి బెదిరింపులు తనకు కొత్త కాదని అన్నారు. ఇదిలా ఉండగా తమిళ చిత్ర పరిశ్రమ ఆయనకు మద్దతుగా నిలిచింది. సినీ నటీమణులు దివ్య స్పందన, వినోదిని వైద్యనాథన్ కమలకు అండగా నిలిచారు. దక్షిణ భారత భాషలన్నీ ద్రవిడ భాషలేనని, వివాదం అనవసర రాద్ధాంతం తప్ప మరొకటి కాదని అన్నారు.

Tags

Next Story