Producer Naga Vamsi : నేను మీకు హామీ ఇస్తున్నా.. రాసిపెట్టుకోండి..నాగవంశీ ట్వీట్

Producer Naga Vamsi : నేను మీకు హామీ ఇస్తున్నా.. రాసిపెట్టుకోండి..నాగవంశీ ట్వీట్
X

రౌడీ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కింగ్డమ్ ' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ మరింత హైప్ ని క్రియేట్ చేశాయి. భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు. అయితే, తాజాగా ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను ఉద్దేశిస్తూ నిర్మాత నాగవంశీ స్పందించాడు. 'ఏం పోస్ట్ చేసినా.. 'కింగ్డమ్ ' మీద తీపి శాపాలు, తిట్లు వస్తూనే ఉంటాయని నాక్కూడా తెలుసు. కానీ నన్ను నమ్మండి. మీకు సిల్వర్ స్క్రీన్ పై ఒక అద్భుతమైన అనుభూతిని అందించడానికి మా టీం 24 గంటలూ పనిచేస్తోంది.. నేను మీకు హామీ ఇస్తున్న. ఈ సినిమా అందించే అనుభూతి, ఉత్సాహం మాత్రం మీరు ఊహించలేరు. ఎందుకంటే అది కొంచెం మిస్ అయినా కూడా మీ క్రియేటివిటీ అంతా నా మీద చూపిస్తారు. నేను మూవీ చూసాక చెప్తున్నా.. రాసిపెట్టుకోండి.. విన్నర్ కింగ్డమే. త్వరలో అదిరిపోయే రిలీజ్ డేట్, టీజర్, సాంగ్ అనౌన్స్ మెంట్ తో కలుద్దాం' అంటూ పోస్టు పెట్టాడు. కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇప్పటికీ క్లారిటీ రాకపోవడం గమనార్హం.

Tags

Next Story