Rana Daggubati : స్కిల్ ఉన్న బెట్టింగ్ యాప్స్‌నే ప్రమోట్ చేశా.. రానా క్లారిటీ

దగ్గుబాటి రానా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పై రానా దగ్గుబాటి ప్రచారంపై ఆయన టీమ్ వివరణ ఇచ్చింది. ఆన్ లైన్ నైపుణ్యం ఆధారిత గేమ్లకు మాత్రమే దగ్గుబాటి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాడని తెలిపింది. దగ్గుబాటి ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారని, దీని గడువు 2017లో ముగిసిందని వివ రించారు. ఆన్లైన్ నైపుణ్యం ఆధారిత గేమ్లను చట్టబద్ధంగా అనుమతించిన వాటికే రానా ఆమెదం తెలిపారని, ఒప్పం దాలు చేసుకునే ముందు రానా దగ్గుబాటి న్యాయ బృందం అన్ని భాగస్వామ్యాలను క్షుణ్ణంగా సమీక్షిస్తుందని వివరించా రు. చట్టపరమైన సమీక్ష తర్వాత, చట్టానికి పూర్తిగా అనుగు ణంగా ఉండేలా ప్లాట్ఫామ్్ను రానా అంగీకరించాడన్నారు. జూదానికి వ్యతిరేకంగా భారత సుప్రీంకోర్టు గుర్తించిన ఈ ఆన్లైన్ గేమ్లను హైలైట్ చేయడం చాలా అవసరమని తెలిపారు. ఈ గేమ్లు అవకాశం మీద కాకుండా నైపుణ్యం మీద ఆధారపడి ఉండటంతో సుప్రీంకోర్టు అను మతి సైతం ఇచ్చిందని రానా దగ్గుబాటి టీమ్ క్లారిటీ ఇచ్చింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com