Ram Charan : ఆ సినిమా చేసినందుకు చింతిస్తున్నా: రామ్ చరణ్

Ram Charan : ఆ సినిమా చేసినందుకు చింతిస్తున్నా: రామ్ చరణ్
X

‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదల నేపథ్యంలో హీరో రామ్ చరణ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో ఏ మూవీ చేసినందుకు చింతిస్తున్నారో తెలిపారు. జంజీర్ సినిమాను రీమేక్‌గా చేసినందుకు చింతిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఈ సినిమాను తెలుగులో ‘తుఫాన్’గా విడుదల చేశారు. ఇందులో చరణ్, ప్రియాంకా చోప్రా ప్రధాన పాత్రల్లో నటించారు. 1973లో రిలీజైన ‘జంజీర్’లో అమితాబ్ బచ్చన్ నటించారు. జంజీర్ కు అపూర్వ లఖియా దర్శకత్వం వహించగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాపై బాలీవుడ్ లో రామ్ చరణ్ వ్యవహారశైలిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. హీరోయిన్ ప్రియాంకచోప్రా కూడా తీవ్రంగా విమర్శించింది. రామ్ చరణ్ అనుకున్న సమయానికి షూటింగ్ కు వచ్చేవాడు కాదని, దీనివల్ల తాను ఒప్పుకున్న ఇతర సినిమాలపై ప్రభావం పడేదని చెప్పింది.

Tags

Next Story