Rashmika Mandanna : అలాంటి అబ్బాయి కావాలి : రష్మిక మందన్న

Rashmika Mandanna : అలాంటి అబ్బాయి కావాలి : రష్మిక మందన్న
X

స్టార్ బ్యూటీ రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ‘పుష్ప-2’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ తాజా ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తన లైఫ్‌లోకి రాబోయే భాగస్వామి ఎలా ఉండాలో చెప్పింది. " నా లైఫ్ లో ప్రతీ మలుపులో తోడుండాలని. క్లిష్ట సమయాల్లో అండగా నిలబడాలి. ప్రతీ సిచువేషన్ లో రక్షణ గా ఉండాలి. పరస్పర గౌరవం, నమ్మకం ముఖ్యం. అవి ఉంటే జీవితాంతం కలిసి ఉండొచ్చు. కోపతాపాలకు దూరంగా అర్థం చేసుకునేవాడై ఉండాలి. అలాంటి అబ్బాయే కావాలనుకుంటున్నా" అంటూ చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం రష్మిక ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ ‘రెయిన్‌బో’ ‘సికందర్‌’ ‘ఛావా’ ‘కుబేర’ చిత్రాల్లో నటిస్తోంది.

Tags

Next Story