Anupriya Goenka : అలా చేయొద్దని వార్నింగ్ ఇచ్చా :అనుప్రియా గోయెంక

మంచు మనోజ్ 'పోటుగాడు' సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అనుప్రియా గోయెంక. 'పాఠశాల' చిత్రంతోనూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అనంతరం బాబీ జాసూస్ మూవీతో హిందీ సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుసగా టైగర్ 3, పద్మావత్, వార్ సహా పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లలో సైతం నటించి సత్తా చాటుతోంది. అసుర్, ఆశ్రమ్, పాంచాలి లాంటి వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది. అయితే తన కెరీర్లో ఎదురైన కొన్ని చేదు అనుభవాల్ని తాజాగా గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది అనుప్రియా. 'ఓ సినిమాలో కిస్సింగ్ సీన్ చేస్తున్న. షూటింగ్ కోసం నేను అసౌకర్యమైన దుస్తులు ధరించా. ఆ సమయంలో ఓ నటుడు నా నడుము పట్టు కోవాల్సి ఉంది. స్క్రిప్టులోనూ అదే ఉంది. కానీ అతడు మరో చోట అసభ్యకరంగా తాకడంతో ఇబ్బంది పడ్డా. వెంటనే అతడిని ప్రశ్నించలేకపోయా. కానీ ఆ తర్వాతి టేక్ తో మాత్రం అలా చేయొద్దని హెచ్చరించా' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బాలీవుడ్ భామ చేసిన కామెంట్స్ నెట్టింటా వైరల్ గా మారాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com