Radhika Apte : ప్రెగ్నెంట్ అని తెలియగానే షాకయ్యా: రాధిక

Radhika Apte : ప్రెగ్నెంట్ అని తెలియగానే షాకయ్యా: రాధిక
X

తాను ప్రెగ్నెంట్ అని తెలియగానే షాక్‌కు గురయ్యానని హీరోయిన్ రాధికా ఆప్టే అన్నారు. పిల్లల కోసం తాము ఎలాంటి ప్లాన్ చేసుకోలేదని ఆమె తెలిపారు. ‘ప్రెగ్నెన్సీ సమయంలో చాలా లావుగా తయారయ్యా. నన్ను నేను చూసుకునేందుకు ఇబ్బంది పడ్డా. కానీ ఇప్పుడు అదే సంతోషం కలిగిస్తోంది. ప్రెగ్నెన్సీ అనేది అంత సులువైన విషయం కాదు. మానసిక, శారీరక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఆమె చెప్పుకొచ్చారు.

నా శరీరంలోని మార్పులు ఇప్పుడు నాకు అందంగా కనిపిస్తున్నాయి. ఈ ఫోటోలను ఎప్పటికీ జ్ఞాపకంగా దాచుకుంటాను. ఒకరికి జన్మనివ్వడం గొప్ప విషయమే! కానీ ఈ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎవరూ బయటకు చెప్పుకోకపోవడం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది అని చెప్పుకొచ్చింది. కాగా రాధికా ఆప్టే డిసెంబర్‌ మొదటివారంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తెలుగులో రక్త చరిత్ర, లెజెండ్‌, లయన్‌ తదితర చిత్రాల్లో ఈమె హీరోయిన్‌గా నటించింది.

Tags

Next Story