ఓపెన్ అయిన బాలీవుడ్ హీరోయిన్.. ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటా అంటూ కామెంట్స్

ఓపెన్ అయిన బాలీవుడ్ హీరోయిన్.. ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటా అంటూ కామెంట్స్
Prabhas: ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని ఆసక్తికర కామెంట్స్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్‌.

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని ఆసక్తికర కామెంట్స్ చేసింది బాలీవుడ్ హీరోయిన్ కృతీ సనన్‌. 'ఆదిపురుష్‌' సినిమాలో ప్రభాస్, కృతీ సనన్‌ జంటగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ ముంబైలో జరుగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల చేయనుంది చిత్ర బృందం. ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్య్వూలో కృతీ సనన్‌ మాట్లాడింది. ''ప్రభాస్‌.. టైగర్‌ ష్రాఫ్‌.. కార్తీక్‌ ఆర్యన్‌' ఈ ముగ్గురి హీరోల్లో మీరు ఎవరితో డేట్‌కు వెళతారు? ఎవర్ని వివాహం చేసుకుంటారు? ఎవర్నీ ఫ్లర్ట్‌ చేస్తారు?' అని యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు కృతీ సనన్‌ ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.

టైగర్‌ ష్రాఫ్‌తో డేటింగ్‌కు వెళతానని, కార్తీక్‌ ఆర్యన్‌ను ఫ్లర్ట్‌ చేస్తానని, ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని కృతీ సనన్‌ చెప్పారు. '1 నేనొక్కడినే' సినిమాతో తెలుగుకి పరిచయం అయిన బాలీవుడ్‌ భామ కృతీ సనన్‌. ఆ తర్వాత దోచేయ్ సినిమాలో చేసింది. ఈ రెండు సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దీంతో బాలీవుడ్ కే పరిమితమైంది. ఆ తర్వాత ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించే 'ఆదిపురుష్‌' సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో సీత పాత్రలో చేస్తుంది. హిందీ, తెలుగుతోపాటు పలు భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ప్రభాస్ 'రాధేశ్యామ్‌', సలార్, ఆదిపురుష్ ఇలా వరుస సినిమాలతో బీజీగా ఉన్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'రాధేశ్యామ్‌'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది.

Tags

Read MoreRead Less
Next Story