Daksha Nagarkar : ఇదేంటి రావణాసుర!

మోడల్ కెరీర్ ప్రారంభించి టాలీవుడలోకి ఎంట్రీ ఇచ్చిన ముంబై భామ దక్షనగర్కర్. 'హుషారు' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచింది. ‘జాంబిరెడ్డి' చిత్రంలో చిట్టి పొట్టి డ్రెస్సులతో యూత్ను ఫిదా చేసేసింది. మాస్ మహారాజా రవితేజతో కలిసి నటించిన ‘రావణాసుర’లో మళ్లీ ప్రేక్షకులను అలరించింది. అక్కినేని నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన 'బంగార్రాజు' చిత్రంలో కూడా స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది. ప్రస్తుతం తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్గా ఉంటోంది. తన హాట్ హాట్ ఫోటో షూట్స్తో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. ఆమె షేర్ చేసే హాట్ పిక్స్ ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఎండలో కూర్చుని ఒక స్టిల్ ఇచ్చింది. ఆ పోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో దక్ష అందానికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ ఆమెకు పర్ఫెక్ట్ మూవీ పడితే బాగుంటుంది అని కోరుకున్నారు. 'లుకింగ్ బ్యూటీ ఫుల్', 'గ్లామర్ క్వీన్ దక్ష', 'గులాబీ లాగా చాలా అందంగా ఉన్నావ్' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్లు చేస్తోందీ భామ. సోషల్ మీడియాలో థైస్ షో చేస్తున్న ఈ ముంబై భామకు ఇప్పుడైనా ఏదైనా మంచి సినిమా తగులుతుందో లేదో..? చూడాలి మరి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com