Samantha : మీ వల్లే ఐడెంటిటీ.. సమంత ఎమోషనల్ స్పీచ్

Samantha : మీ వల్లే ఐడెంటిటీ.. సమంత ఎమోషనల్ స్పీచ్
X

చాలా రోజులుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న టాలీవుడ్ బ్యూటీ సమంత.. ప్రస్తుతం సెకండ్ ఇన్ని్ంగ్స్ స్టార్ట్ చేసింది. ఒకవైపు హీరోయిన్ గా రాణిస్తూనే మరోవైపు నిర్మాతగా మారింది.ఇటీవల ట్రాలాలా పిక్చర్ పై 'శుభ్రం' చిత్రాన్నినిర్మించిన సామ్.. అందులో కీలక పాత్రలో నటించి 'మాయ' చేసింది. కాగా.. శేఖర్కమ్ముల తెరకెక్కిస్తున్న ఒక ఫిమేల్ ఓరి యెంటెడ్ సినిమాలో సమంతనే హీరోయిన్ గా నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ .. తాజాగా యూఎస్ లో జరిగిన తానా 2025 కాన్ఫరెన్స్ లో ఎమోషనల్ అయ్యింది. 'నేను తానా గురించి ప్రతి సంవత్సరం వింటూనే ఉంటా. మొదటి సినిమా 'ఏ మాయ చేశావే' నుంచి నా పై మీరు ప్రేమ చూపిస్తున్నారు. నాకు ఒక ఐడెంటిటీ, ఒక ఇల్లు.. నేను ఇక్కడే ఉండాలనే ఫీలింగ్ అందించింది మీరే. నేను ఏ భాషలో ఏ సినిమా చేసినా ముందుగా తెలుగు ఫ్యాన్స్ గురించే ఆలోచిస్త. నా ‘ఓ బేబీ' చిత్రం అమెరికాలో మిలియన్ డాలర్లు కలెక్షన్ చేసినప్పుడు చాలా ఆశ్చర్యపోయా. మీరు భౌగోళికంగా ఎంత దూరం ఉన్నా ఎప్పుడూ నా హృదయం లోనే ఉంటారు' అంటూ కన్నీళ్లతో తన స్పీచ్ ముగించింది.

Tags

Next Story