Identity on OTT : విడుదలైన వారానికే ఓటీటీలో ఐడెంటిటీ!

Identity on OTT : విడుదలైన వారానికే ఓటీటీలో ఐడెంటిటీ!
X

స్టార్ హీరోయిన్ త్రిష, మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ జంటగా నటించిన చిత్రం ఐడెంటిటీ. మలయా ళంలో భారీ హిట్ సాధించిన ఈ సినిమాను మాక్స్ శ్రీనివాస్ మామిడాల సమర్పణలో వేదాక్షర చింతపల్లి రామారావు తెలుగులో ఇవాళ విడులైంది. ఈ మూవీని అఖిల్ పాల్, అనాసన్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిం చారు. క్రైమ్, థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమాలో వినయ్ రాయ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది. ఈ నెల 31న స్ట్రీమింగ్ చేయనున్న ట్టు ఆ సంస్థ ప్రకటించింది. మలయాళంలో మాత్రమే కాదు... తెలుగు, ‌తమిళ, కన్నడ భాషల్లో జనవరి 31వ తేదీ నుంచి 'ఐడెంటిటీ'ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 అనౌన్స్ చేసింది. తెలుగు రాష్ట్రాలలోని థియేటర్లలో విడుదలైన వారానికే ఓటీటీ సినిమా వస్తుండడం గమనార్హం. మరి, ఈ విషయం తెలిసిన తెలుగు ప్రేక్షకులు సినిమా చూడడానికి థియేటర్లకు వెళతారో? లేదో? వారానికి ఓటీటీలో వచ్చే సినిమా చూసేందుకు వంద రూపాయలు అయినా సరే ఖర్చు చేస్తారంటారా? వెయిట్ అండ్ సి.

Tags

Next Story