Bellamkonda : అలా చేస్తే ఇండస్ట్రీకి గుడెబై చెప్పేస్తా: బెల్లంకొండ

Bellamkonda : అలా చేస్తే ఇండస్ట్రీకి గుడెబై చెప్పేస్తా: బెల్లంకొండ
X

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కౌశిక్ పెగల్లపాటి కాంబోలో తెరకెక్కించిన మూవీ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గార్లపాటి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి చిన్మయ్ సలాస్కర్ సినిమాటోగ్రఫీ, చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. హారర్ మిస్టరీ కథతో రూపొందిన ఈ సినిమా ఈనెల 12న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యం లో తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి శ్రీని వాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్చేశాడు. 'రెండు గంటలు మనం సమయాన్ని మర్చిపోయేలా చేసేదే మూవీ. థియేటర్కు వచ్చిన ఆడియ న్స్ రెండున్నర గంటలు ఫోన్ చూడలేదంటే ఆ సినిమా సక్సెస్అయినట్టే. 'కిష్కింధపురి' అలాంటి చిత్రమే. మూవీ స్టార్ట్ అయ్యాక ఆడియన్స్ మొదటి 10 నిమిషాల తర్వాత ఎవరైనా ఫోన్ పట్టుకుంటే.. నేను ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతా. ఎవరూ మొబైల్ చూడరని చాలెంజ్ చేసి చెప్పగలను. స్టోరీ అంత ఆసక్తిగా ఉంటుంది. మంచి సినిమా చూశామనే అనుభూతి ఆడియన్స్ కు ఇవ్వడానికి మేం 100శాతం కష్టపడ్డాం. మీరు మరో ప్రపంచంలోకి వెళ్తారు. తెలుగు ప్రేక్షకులు కష్టాన్ని గుర్తిస్తారు. దానికి ఉదాహరణ 'భైరవం' సినిమానే. ఆ చిత్రంలో నా నటన కంటే నా కష్టమే అందరికీ కనిపించింది. ఆ మూవీ తర్వాత ఎక్కడికి వెళ్లినా నన్ను గౌరవిస్తున్న రు. ఇండస్ట్రీలో మన అనుకునే వాళ్లు ఎవరూ ఉండరు. ముందు బాగానే మాట్లాడిన, వెనకాల ఇంకోటి మాట్లాడుతారు' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం సాయి శ్రీనివాస్ చేతిలో కిష్కింధపురితో పాటు హైందవ, టైసన్ నాయుడు చిత్రాలు ఉన్నాయి.

Tags

Next Story