Tamannaah : కంటెంట్ బాగుంటే పెద్ద సినిమా అవుతుంది: తమన్నా

Tamannaah : కంటెంట్ బాగుంటే పెద్ద సినిమా అవుతుంది: తమన్నా
X

చాంద్ సా రోషన్ చెహ్రాతో బాలీవుడ్లో అడుగుపెట్టంది తమన్నా. ఆ తర్వాత శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు, కేడితో తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యింది. బాహుబలి 2లో అవంతికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రిన్స్ మహేశ్ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఐటెం సాంగ్లో కనిపించింది. ప్రస్తుతం ఓదెల 2 సినిమాతో నటిగా తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించనుంది తమన్నా. ఓదెల సినిమాకు సీక్వెల్ గా దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కించిన ఈ సినిమాలో శివశక్తిగా నటించింది. ఈ నెల 17న విడుదల కానున్న ఈ సినిమా ప్రమో షన్స్ లో ప్రస్తుతం బిజీగా ఉంది. ఆఫర్లు లేక చిన్న సినిమాలో నటిస్తున్నారా అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు తమన్నా సమాధానం ఇచ్చారు. కంటెంట్ బాగుంటే పెద్ద సినిమా అవుతుందని, లేకపోతే చిన్న చినిమా అవుతుందని చెప్పుకొచ్చింది. తన దృష్టిలో మాత్రం చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ ఉండదని చెప్పింది.

Tags

Next Story