Ileana : ఇలియానా రీ ఎంట్రీ సూన్

Ileana : ఇలియానా రీ ఎంట్రీ సూన్
X

'దేవదాసు' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా.. మహేశ్ బాబు 'పోకిరి' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో ఈ అమ్మడు క్రేజ్ విపరీతంగా పెరిగింది. తర్వాత పవన్ తో 'జల్సా', రవితేజతో 'కిక్' వంటి వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. బాలీవుడ్ స్టార్స్ లోనూ నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. ఇక కెరీర్ పీక్స్ ఉండగానే.. బేబీ బంప్ తో దర్శనమిచ్చి అందరికీ షాకిచ్చింది. ఇక ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ .. ఇప్పుడు రెండో సారి కూడా తల్లి కాబోతుంది. అయితే వ్యక్తిగతంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యాన్స్ తో మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడు టచ్లోనే ఉంటుంది. తాజాగా, ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమాను లతో చిట్ చాట్ చేసింది. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇందులో భాగంగా ఇండస్ట్రీకి రీ-ఎంట్రీ ఇవ్వడంపై క్లారిటీ ఇచ్చింది. ‘ఇండస్ట్రీని నేనెంతో మిస్ అవుతున్నా. రైడ్ నాకు ప్రత్యేకమైన మూవీ. సీక్వెల్ తెరకెక్కించాలనుకున్నప్పుడు టీమ్ నన్ను సంప్రదించింది. మళ్లీ యాక్ట్ చేయమని అడిగింది. కానీ అదే టైంలో నాకు బాబు పుట్టాడు.దీంతో ఆ సినిమా చేయలేకపోయాను. కానీ మీ అందరికోసం భవిష్యత్తులో తప్పకుండా మంచి కంబ్యాక్ అయితే ఇస్త. లైఫ్ నేను ఊహించిన దానికంటే పూర్తి భిన్నంగా ఉంది.. ప్రతీ రోజూ 24 గంటలు రెస్ట్ అన్నదే ఉండటం లేదు.. కానీ ఎంత కష్టంగా ఉన్నా కూడా నా బిడ్డ స్మైల్, స్పర్శతో అవన్నీ మాయం అవుతున్నాయి. మాతృత్వం అనేది గొప్ప ఫీలింగ్' అని రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింటలో వైరల్ గా మారాయి.

Tags

Next Story