Kenishaa Francis : నేనేం దేవదూతను కాదు .. రూమర్స్ పై మాట్లాడను : కెనీషా

Kenishaa Francis : నేనేం దేవదూతను కాదు .. రూమర్స్ పై మాట్లాడను : కెనీషా
X

తమిళ హీరో జయం రవి, కెనీషా రిలేషన్ లో ఉన్నట్టు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. వీరిపై ఎన్నో రూమర్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ఆమె గర్భిణి అంటూ కొన్ని రోజులుగా రూమర్స్ వస్తున్నాయి. వాటిపై కెనీషా మరోసారి స్పందించారు. “నేనేం దేవదూతను కాదు. అలాగని దెయ్యాన్ని కూడా కాదు. సోషల్ మీడియాలో నాపై ఇలాంటివి ఒకదాని తర్వాత ఒకటి పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఒక గాసిప్ మరో దానికి దారితీస్తోంది. అన్నిటికీ కాలమే పరిష్కారం చూపుతుంది. వీటికి నేను కూడా సమాధానం చెప్పగలను. కానీ, నేను మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను' అని పేర్కొన్నారు. ఒక పాట చిత్రీకరణ సమయంలో కెనీషా ఫొటోను ఉద్దేశిస్తూ కొందరు ఈ రూమర్స్ సృష్టించడం గమనార్హం. భార్య ఆర్తి నుంచి తాను విడాకులు తీసుకుంటున్నట్టు జయం రవి గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. కెనీషాతో రిలేషన్ వల్లే ఆర్తికి డివోర్స్ ఇచ్చారని టాక్ స్టార్ట్ అయ్యింది. ఈ రూమర్స్ కు ఎప్పుడు శుభం పడుతుందో కార్డు చూడాలి మరి.

Tags

Next Story