Vidya Balan : నాకు12 గంటలైనా ఓకే.. విద్యాబాలన్ కీలక కామెంట్స్

'పరిణీత' మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ విద్యాబాలన్. సిల్క్ స్మిత జీవి తకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'ది డర్టీ పిక్చర్' తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా మహిళా ప్రాధాన్యమున్న పాత్ర లను ఎంచుకొంటూ.. అభిమానుల ప్రశం సలు అందుకుంది. చివరిగా కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించిన 'భూల్ భూలయ్యా 3'లో కనిపించింది. అయితే కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన వర్కింగ్ అవర్స్ అంశంపై తాజాగా విద్యాబాలన్ తన అభిప్రాయాన్ని పంచుకుంది. 'బిడ్డకు జన్మనిచ్చిన మహిళలు ఫ్యామిలీతో ఎక్కువ టైం గడపాలి. అలాంటి వారికి చాన్స్ ఇవ్వాలంటే కచ్చితంగా కొన్ని మార్పులు చేయాల్సిందే. అయితే నాలాంటి వారికి బాధ్యతలు తక్కు వగా ఉంటాయి. కాబట్టి ఎక్కువ సమాయాన్ని షూటింగ్లకు కేటాయించగలం. కెరీర్, కుటుంబం మధ్య సమతుల్యత సాధించడం అనేది నేటి మహిళలకు ఒక సవాలు. అయితే, మాతృత్వానికి ప్రాధాన్యత ఇస్తూ, బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన సమయాన్ని కేటాయించడం దీర్ఘకాలంలో తల్లికి, బిడ్డకు ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. నేను 12 గంటలైనా చిత్రీకరణలో పాల్గొనడానికి రెడీ ఉన్న. ప్రపంచంలో ఏ ప్రాంతంలో షూటింగ్ చేసినా పాల్గొనగలను. ప్రస్తుతం ఒత్తిడికి దూరంగా ఉంటూ సమయాన్ని ఆస్వాదిస్తున్న. ప్రస్తుతం రెండు సినిమా లకు ఓకే చెప్పా. త్వరలోనే వాటి వివరాలు చెబుతా' అంటూ పేర్కొంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com