Nazriya : ఎవరైనా బాధపడుంటే ఐయామ్ సారీ : నజ్రియా

రాజారాణి సినిమాతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన నజ్రియా..అంటే సుందరానికి మూవీతో ఫ్యాన్స్ ను మరోసారి ఆకట్టుకుంది. నేరం, ఓం శాంతి ఓషానా, బెంగళూరు డేస్, కూడె, కుంబలంగి నైట్స్, కూడె వంటి పలు చిత్రాలతో తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా స్టేటస్ అందుకుంది. గతేడాది చివర్లో ‘సూక్ష్మదర్శిని' మలయాళ చిత్రంతో హిట్ అందుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన నాటినుంచి ఆమె సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంది. దీంతో రకరకాల కామెంట్స్ మొదలయ్యాయి. తాజాగా నజ్రియా ఒక ఎమోషన ల్ నోట్ రిలీజ్ చేసింది. 'నేను కొంతకాలంగా అందరికీ దూరంగా ఉంటున్నాను. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేను. నా 30వ పుట్టినరోజు, నూతన సంవత్సర వేడుకలు, నా చిత్రం సక్సెస్ మీట్లు.. ఇలా దేనికీ నేను అటెండ్ కాలేదు. చాలావాటిని మిస్ అయ్యాను. నా ఫ్రెండ్స్ ఫోన్లు కూడా ఎత్తలేదు. వారి మెసేజ్లకు స్పందించలేదు. నా వల్ల ఎవరైనా బాధపడుంటే.. దయచేసి క్షమించండి. అలాగే పనికోసం నన్ను సంప్రదించాలనుకున్న నా సహనటులు కూడా నన్ను మన్నించాలని వేడుకుంటున్నాను. అందరికీ కనిపించ కుండా పోయి ఇబ్బంది పెట్టినందుకు సారీ.. ఇకపోతే ఉత్తమ నటిగా కేరళ ఫిలిం క్రిటిక్స్ అవార్డు అందుకున్నందుకు సంతోషంగా ఉంది. నా ప్రతిభను గుర్తించినందుకు థాంక్యూ. ఈ జర్నీ కష్టంగా ఉంది. నేను త్వ రలోనే కోలుకొని మీ ముందుకువస్త. నా పరి స్థితిని మీరందరూ అర్థం చేసుకుని అండగా ఉంటారని ఆశిస్తున్నాను' అంటూ పేర్కొంది. ఎట్టకేలకు కొత్త పోస్ట్లో అన్ని రూమర్స్ కు చెక్ పెట్టేసింది నజ్రియా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com