Imanvi : ఇమాన్వీకి టాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా

Imanvi : ఇమాన్వీకి టాలీవుడ్ ఫ్యాన్స్ ఫిదా
X

టాలీవుడ్ కు మరో కొత్త నటి పరిచయం కాబోతుంది. రెబల్ స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో ప్రారంభమైన కొత్త సినిమా పూజా కార్యక్రమంలో మెరిసిన కథానాయిక ఇమాన్వీ ఇస్మాయిల్ కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యాయి. ఆమె గురించి సినీ ఫ్యాన్స్ తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇప్పటికే ఇన్స్టా ఫాలో అవుతున్న యువతకు ఇమాన్వీ రీల్స్ కొత్తేమీ కాదు. తన డ్యాన్స్, స్టెల్ తో కట్టిపడేస్తుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ పాటలకూ ఆమె వేసే స్టెప్లు ఎంతగానో అలరిస్తాయి. ఇప్పుడు ఇమాన్వీ ఇప్పుడు ఏకంగా పాన్ఇండియా స్టార్ ప్రభాస్ సరసన జోడీగా నటించే చాన్స్ రావడంతో ప్రస్తుతం సోషల్ మీడియా వేదిగా ఆమె పేరు ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే ఇమాన్వీకి ఇన్స్టాగ్రామ్ లో 7 లక్షలు, యూట్యూబ్లో సుమారు 5 లక్షల ఫాలోవర్లు ఉన్నారు. తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన తర్వాత తక్కువ వ్యవధిలోనే 60 వేల మంది ఫాలోవర్లు ఆమె ఖాతాలో చేరారు. ఇస్మాయిల్ పాత ఫొటోలు ఆమె డ్యాన్స్ వీడియోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే సినిమాలో హను రాఘవపూడి ఇమాన్వీ పాత్రను ఎలా రూపొందిస్తాడనే దానిపై ఆసక్తి ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్నారు.

Tags

Next Story