Avika Gore : బాడీగార్డ్ అసభ్యంగా తాకాడు : అవికా గోర్

Avika Gore : బాడీగార్డ్ అసభ్యంగా తాకాడు : అవికా గోర్
X

యంగ్ బ్యూటీ అవికా గోర్ తో తన బాడీగార్డ్ అసభ్యంగా తాకాడట. ఇదే విషయాన్ని చెప్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది అవికా. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. అవికా తన పన్నెండేళ్ల వయసులోనే నటన రంగంలోకి వచ్చింది. తన నటన, అందం, అభినయంతో మెప్పించి ఇండస్ట్రీలో కొనసాగుతోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అవికా గోర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘‘నన్ను కాపాడుతాడని ఓ వ్యక్తికి నేను బాడీ గార్డుగా ఉద్యోగం ఇచ్చాను. కానీ నాతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు. ఓ ఈవెంట్‌లో నన్ను ఆ బాడీగార్డు దారుణంగా తాకాడు. రెండు సార్లు అలాగే చేశాడు. నేను ఏంటి అని అడిగాను. వెంటనే సారీ చెప్పాడు. ఆ బాడీగార్డును కొట్టే ధైర్యం నాకు అప్పుడు లేదు. కానీ ఇప్పుడు నాతో అసభ్యంగా ప్రవర్తించిన వారిని కొట్టగలను అని అనుకుంటున్నాను. అయితే నేను పెద్దయ్యాక ఎన్నో హింసలు, సవాళ్లు ఎదుర్కొన్నాను. నా లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు’’ అని చెప్పుకొచ్చింది.

Tags

Next Story