Indian 3 : ఇండియన్ 3 థియేటర్లోనే రిలీజ్.. శంకర్ క్లారిటీ

X
By - Manikanta |20 Dec 2024 11:04 AM IST
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ఇండియన్ 2. భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాపై తీవ్ర ట్రోలింగ్ కూడా జరిగింది. ఈ నేపధ్యంలోనే తాజాగా ఇండియన్ 2పై వచ్చిన ట్రోలింగ్ గురించి స్పందించాడు శంకర్. "ఇండియన్ 2పై ఇంత దారుణంగా ట్రోలింగ్ జరుగుతుందని నేను ఊహించలేదు. వాటిని నా తరువాతి సినిమాలతోనే సమాధానం చెప్తాను. గేమ్ ఛేంజర్ అందరికీ నచ్చుతుంది. ఇండియన్ 3 కూడా ఓటీటీలో కూడా ఖచ్చితంగా థియేటర్స్ లోనే విడుదల అవుతుంది. అంటూ చెప్పుకొచ్చాడు శంకర్. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com