Indian Cinema : రష్యాలో ఇండియన్ సినిమా జెండా

Indian Cinema :  రష్యాలో ఇండియన్ సినిమా జెండా
X

ఇండియన్ సినిమా ఎల్లలు దాటి ఏళ్లవుతోంది. రాజమౌళి బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు మన సినిమా అంటే ప్రపంచం అంతా ఆసక్తిగా చూసేలా మారింది. ప్రభాస్, యశ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్స్ ను గ్లోబల్ స్టార్స్ అనేస్తున్నారు. అమెరికా, ఇంగ్లండ్, సింగపూర్, మలేసియా, జపాన్, దుబాయ్ తో పాటు అనేక దేశాల్లో ఇండియన్ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ చూసి రష్యా సైతం ముందుకు వచ్చింది. ఇకపై తమ దేశంలో ఇండియన్ సినిమాలకు సంబంధించి ఓ పాలసీ తీసుకువస్తాం అని.. అక్కడ ఇండియన్ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం అని ఇంగ్లండ్ ప్రెసిడెండ్ పుతిన్ స్వయంగా చెప్పడం విశేషం.

దశాబ్దాలుగా రష్యా ఎన్నో విషయాల్లో అమెరికాతో పోటీ పడుతూ వస్తోంది. కమ్యూనిస్టులు పాలించినప్పుడు రష్యా ప్రపంచంలోనే సూపర్ పవర్ గా ఉంది. పెట్టుబడి దారుల చేతుల్లోకి వెళ్లిన తర్వాతే అమెరికా పై చేయి సాధించింది. అందుకే ఈ రెండు దేశాల సినిమాల్లో విలన్ గా వేరే దేశం వాళ్లే కనిపిస్తుంటారు. ఇది రష్యన్స్ కు కూడా బోర్ కొట్టించి ఉంటుంది. అందుకే ఇండియన్ సినిమాలపై మోజు పడుతున్నారు. మిగతా దేశాలతో పోలిస్తే రష్యాలో ఇండియన్స్ సంఖ్య తక్కువే. అయినా ఆ భాషలో మన ఎమోషన్స్ ను డబ్ చేస్తే కచ్చితంగా ఆకట్టుకుంటుంది. మొత్తంగా పుతిన్ స్టేట్మెంట్ తో ఇండియన్ సినిమా సత్తా ఏంటనేది ప్రపంచం మొత్తానికి క్లియర్ గా తెలిసిపోయిందనే చెప్పాలి.

Tags

Next Story