Pushpa - 2 : ఇండియన్ మూవీ బిగ్గెస్ట్ రిలీజ్ పుష్ప - 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో పుష్ప 2 ది రూల్ రూపొందుతోంది. అయితే పుష్ప మూవీకి సీక్వెల్గా వస్తున్న ఈమూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మూవీ షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన క్షణంలో వైరల్ అవుతోంది. అయితే కొద్దిరోజుల్లో థియేటర్లలోకి రానున్న ఈ మూవీ రిలీజ్కు ముందే రికార్డు సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ స్క్రీన్లపై రిలీజ్ కానున్న ఇండియన్ మూవీ బిగ్గెస్ట్ రిలీజ్ గా రికార్డుకెక్కింది. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. డిసెంబర్ 5 రిలీజ్ అవుతున్న ఈ మూవీని వరల్డ్ వైడ్గా ఆరు భాషల్లో కలపి మొత్తం 11500 స్క్రీన్ లలో విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మేకర్స్ ప్రకటించారు. ఇండియాలో 6500 స్క్రీన్స్, ఓవర్సీస్ లో 5000 స్క్రీన్లలో మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com