Kangana Ranaut : ఇందిరా గాంధీ చాలా బలహీనమైన వ్యక్తి: కంగన
![Kangana Ranaut : ఇందిరా గాంధీ చాలా బలహీనమైన వ్యక్తి: కంగన Kangana Ranaut : ఇందిరా గాంధీ చాలా బలహీనమైన వ్యక్తి: కంగన](https://www.tv5news.in/h-upload/2025/01/10/1446078-kangana.webp)
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జీవితం ఆధారంగా ‘ఎమర్జెన్సీ’ని కంగనా రనౌత్ తెరకెక్కించారు. ఆ మూవీ ప్రమోషన్ల సందర్భంగా ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఇందిర చాలా బలహీనమైన వ్యక్తి అని నా పరిశోధనలో అర్థమైంది. ఆమె మీద ఆమెకే నమ్మకం లేదు. అందుకే పరిస్థితులపై మరింత నియంత్రణను కోరుకున్నారు. తన మనుగడకు చాలామందిపై ఆధారపడ్డారు. అయితే ఈ సినిమా ద్వారా ఎవరి మనోభావాల్ని దెబ్బతీయాలన్న ఉద్దేశమూ నాకు లేదు’ అని పేర్కొన్నారు. పొలిటికల్ డ్రామాకు దర్శకత్వం వహించడం తప్పుడు నిర్ణయమని నటి కంగన పేర్కొన్నారు. ఎమర్జెన్సీ చిత్రాన్ని థియేటర్‌లో విడుదల చేయడం కూడా సరైంది కాదని భావించానని, సెన్సార్ అవసరం లేకుండా OTTలో మంచి డీల్ దక్కేదనుకున్నట్టు చెప్పారు. CBFC సర్టిఫికెట్ నిలిపివేయడంతో భయపడ్డానని, NDA ప్రభుత్వం ఉండడం వల్ల తన చిత్రానికి ఏమీ కాదని భావించానని పేర్కొన్నారు. జనవరి17న చిత్రం విడుదల కానుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com