Rajamouli : రాజమౌళిని ఫాలో అవుతున్న ఇండోనేషియా బ్యూటీ
హీరో మహేశ్‌బాబు (Mahesh Babu), దర్శకుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ చిత్రం రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్ర్కీప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీకి నటీనటుల ఎంపిక జరగుతోంది. హాలీవుడ్ తరహాలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఎక్కువగా వీదేశీ నటులను ఎంపిక చేయనున్నారని సమాచారం. పాన్ వరల్డ్ స్థాయిలో రూపోందుతున్న ఈ మూవీ గురించి ఇప్పుడో ఇంట్రెస్టి్ంగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే.. ఈ సినిమాలో మహేష్ సరసన ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ (Chelsea Elizabeth) ఇస్లాన్ నటించనుందని తెలుస్తోంది. ఎందుకంటే ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దర్శకుడు రాజమౌళిని ఫాలో అవుతుంది. దీంతో మహేశ్‌కు జోడీగా చెల్సియా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటూ వార్తలు తెగ వైరల్ గా మారాయి. అయితే దీనిపై మేకర్స్ స్పందించాల్సి ఉంది. అంతకుముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఈ సినిమాలో నటించనుందంటూ వార్తలు వచ్చాయి.
జకార్తాలో స్టడీ కంప్లీట్ చేసిన చెల్సియా 2013లో హాలీవుడ్ ఫిల్మ్ రిఫ్రైన్ తో తెరంగేట్రం చేసింది. తర్వాత ‘స్ట్రీట్ సొసైటీ’, ‘హెడ్‌షాట్’, ‘మే ది డెవిల్ టేక్ యు’ తదితర సినిమాలతో మంచి గుర్తింపు పొందింది. సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు మంచి ఫాలోయింగ్ ఉంది. కాగా ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథ అందిస్తుండగా.. కీరవాణి మ్యూజిక్ సమకూరుస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది వేసవిలో ప్రారంభం కానుందట.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com