Indra Re-Release : ఇంద్ర ఈజ్ బ్యాక్ .. ఆగస్టు 22న రీరిలీజ్

Indra Re-Release : ఇంద్ర ఈజ్ బ్యాక్ .. ఆగస్టు 22న రీరిలీజ్

మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్కు వైజయంతి మూవీస్ గుడ్ న్యూస్ చెప్పింది. చిరు హీరోగా తెరకెక్కిన 'ఇంద్ర' మూవీని రీరిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈనెల 22న తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తామని ట్వీట్ చేసింది. బి.గోపాల్ దర్శక త్వంలో తెరకెక్కిన ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో గుర్తుండిపోయే చి త్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇంద్రసేనారెడ్డి, శంకరానారాయణగా డ్యూయల్ షేడ్ క్యారెక్టర్ లో చిరంజీవి అద్భుతమైన నటనను కన బరిచాడు. అందులోని డైలాగ్స్, ఆయన మ్యానరిజం గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. సినీ ప్రియులపై అంతగా ప్రభావం చూపిన ఈ మూవీ 2002 జులై 24న విడుదలైం ది. ఇటీవలే 22 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. చిరుగా జోడీగా ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రే హీరోయిన్లుగా నటించారు. శివాజీ, ప్రకాశ్జ్ కీ రోల్ పోషించారు. ఈసినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించాడు. మరోవైపు చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22 సందర్భంగా విశ్వంభర సినిమా నుంచి టీజర్ విడుదల కానుంది. ఈమూవీకి సంబం ధించిన మేజర్ సన్నివేశాల షూట్ ఇప్పటికే పూర్తైంది. మల్లిడి వశిష్ట మెగాస్టార్ తో ఎలాంటి సినిమాను తెర కెక్కించారో మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ఈ ఫిల్మ్ కోసం ఏకంగా 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.

Tags

Next Story